Maternity Leave: ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ – ఇకపై ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు

AP CM Chandrababu Announce Good News For Female Employers Maternity Leave

Maternity Leave: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అందించారు. ఇప్పటివరకు కేవలం ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఈ పరిమితిని తొలగించి, ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Maternity Leave Update

ఇంతకు ముందు అధిక సంతానం వద్దని తానే చెప్పానని, కానీ ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త మార్పులను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, ‘తల్లికి వందనం‘ పథకాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం అందుబాటులో ఉండాలని, పని ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం తీసుకున్న ఈ కీలక నిర్ణయం మహిళా ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త మార్గదర్శకాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయనే దానిపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

Tags: ఏపీ ప్రసూతి సెలవులు, చంద్రబాబు ప్రకటించిన నిబంధనలు, తల్లికి వందనం, ప్రభుత్వ ఉద్యోగుల లాభాలు, AP maternity leave, maternity leave for govt employees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *